More jobs for one ఒకరికే మరిన్ని ఉద్యోగాలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:51 PM
More jobs for one డీఎస్‌సీ ఫలితాల్లో విజయనగరానికి చెందిన కేవీఎన్ శ్రీరామ్ ఐదు ఉద్యోగాలు సాధించారు.
ఒకరికే మరిన్ని ఉద్యోగాలు
రికార్డు స్థాయిలో ప్రతిభ చాటిన డీఎస్సీ అభ్యర్థులు
డీఎస్‌సీలో ఐదు కోలువులు సాదించిన శ్రీరామ్
విజయనగరం రింగురోడ్డు, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): డీఎస్‌సీ ఫలితాల్లో విజయనగరానికి చెందిన కేవీఎన్ శ్రీరామ్ ఐదు ఉద్యోగాలు సాధించారు. ఎస్‌ఏ గణితంలో 7వ ర్యాంకు, ఫిజిక్స్‌లో 10వ ర్యాంకు, జోన్‌స్థాయి పోస్టులో పీజీటీ మ్యాథ్స్‌లో 5వ ర్యాంకు, టీజీటీ మ్యాథ్స్‌లో 18వ ర్యాంకు, జనరల్ సైన్స్‌లో 7వ ర్యాంకు సాధించి అందరినీ అబ్బుర పరిచాడు. శ్రీరాం కొద్ది నెలల కిందట తెలంగాణ డీఎస్‌సీ పోటీ పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సబ్జెక్టులో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకు సాధించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
మూడు ఉద్యోగాలు సాధించిన అనిత
వేపాడ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): సింగరాయి గ్రామానికి చెందిన బోకం అనిత డీఎస్సీలో మూడు ఉద్యోగాలు సాధించారు. సోషల్ అసిస్టెంట్ బయోలజీలో 89.7 మార్కులతో స్టేట్ ఫస్టు రాగా టీజీటీ బయాలజీలో 84.9 మార్కులతో స్టేట్ ఫస్టు సాధించారు. అలాగే టీజీటీ సైన్సులో 79.9 మార్కులతో స్టేట్ ర్యాంకులో నిలిచారు. ఒకే అభ్యర్థిని మూడు స్టేట్ ర్యాంకులు సాధించడంతో ఆమెను అందరూ అభినందిస్తున్నారు. అనిత ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 8.4/10 మార్కులు, బీఈడీ 8.08/10 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.