Elephants గజరాజుల కదలికలపై పరిశీలన
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:33 PM
Monitoring the Movements of Elephants కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాన్ని సోమవారం అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి శాంతి ప్రియపాండే , కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు గజరాజులు ఎక్కువగా ఎటువంటి ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాయి? ఏ సమయంలో ఎటువైపు సంచరిస్తున్నాయన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర బృందం అధ్యయనం
కొమరాడ, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాన్ని సోమవారం అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి శాంతి ప్రియపాండే , కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు గజరాజులు ఎక్కువగా ఎటువంటి ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాయి? ఏ సమయంలో ఎటువైపు సంచరిస్తున్నాయన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించి.. వాటి ఆలోచనలను ముందస్తుగా అటవీశాఖాధికారులు గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయాలని శాంతి ప్రియపాండే ఆదేశించారు. వాటి బారిన ఎవరూ పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అనంతరం వాటి తరలింపు అంశంపై చర్చించారు. ఏనుగుల వల్ల పంటలను నష్టపోతున్నామని, తమను ఆదుకోవాలని పలువురు రైతులు బృంద సభ్యులను కోరారు. ఈ పరిశీలనలో డీఎఫ్‌వో ప్రసూన, పార్వతీపురం రేంజ్ అధికారి మణికంఠేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
తాలాడలో పర్యటించిన బృందం
భామిని: తాలాడ గ్రామంలోని ఏనుగులు సంచరించే ఐలాంతోట, వంశధార నది తీర ప్రాంతాన్ని కూడా అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి శాంతి ప్రియపాండే, కేంద్ర నిపుణుల బృందం పరిశీలించింది. తొలిసారిగా కేంద్ర బృందం పర్యటించడంతో ఇకనైనా ఏనుగుల బెడద నుంచి రక్షించాలని మండలవాసులు కోరుతున్నారు. సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్, పాలకొండ రేంజర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.