Share News

Students’ Health విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:05 AM

Monitor Students’ Health విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీఎంహెచ్‌వో బాస్కరరావు ఆదేశించారు. మంగళవారం కురుపాంలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు.

 Students’ Health విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి
ఏకలవ్య పాఠశాలతో సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

కురుపాం/గుమ్మలక్ష్మీపురం,జూన్‌24(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీఎంహెచ్‌వో బాస్కరరావు ఆదేశించారు. మంగళవారం కురుపాంలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. పాఠశాలలో దోమల నివారణకు ఏసీఎం స్ర్పేయింగ్‌ చేయాలని, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రిన్సిపల్‌ యోగేంద్ర బహుదూర్‌ , మాదలింగి పీహెచ్‌సీ వైద్యాధికారి తనూజను ఆదేశించారు. అనంతరం ఆయన గుమ్మలక్ష్మీపురం మండలంలోని తిక్కబాయి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, మలేరియా, జ్వరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. తప్పనిసరిగా దోమతెరలు వాడాలన్నారు. ఆ తర్వాత తాడికొండ పీహెచ్‌సీలో మందులు, రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్‌ టి.జగన్మోహనరావు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ వినోద్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:05 AM