విద్యార్థిని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:45 PM
ఎల్.కోట గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ చదువుతున్న కన్నంరెడ్డి యశ్వంత్‌ను ఎమ్మెల్యే లలితకుమారి దత్తత తీసుకున్నారు.
లక్కవరపుకోట, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఎల్.కోట గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ చదువుతున్న కన్నంరెడ్డి యశ్వంత్‌ను ఎమ్మెల్యే లలితకుమారి దత్తత తీసుకున్నారు. పీ-4లో భాగంగా ఆర్థికభారంతో ఇబ్బంది పడుతూ చదివించలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారని తెలిసి యశ్వంత్‌ను దత్తత తీసుకున్నానని ఆమె తెలిపారు. ఇకపై విద్యార్థి చదువు బాధ్యత తనదేనని పేర్కొన్నారు. మొదటి విడత ఫీజుగా రూ.25వేలను అందజేశారు. ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని విద్యార్థి తండ్రి శ్రీనివాసరావు కంటతడిపెట్టాడు. ఈ కార్యక్రమంలో కేబీఏ రాంప్రసాద్, ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, కొటాన విజయ్‌కుమార్, అక్కిరెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు.