Nagavali నాగావళికి స్వల్ప వరద
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:18 PM
Minor Flood in Nagavali తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి శుక్రవారం స్వల్పంగా వరద పొటెత్తింది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పైప్రాంతం నుంచి నదిలోకి సుమారు 900 క్యూసెక్కులు చేరింది. ఈ మేరకు శుక్రవారం అధికారులు స్పిల్‌వే గేట్లు తెరిచి.. దిగువ ప్రాంతానికి సుమారు 750 క్యూసెక్కులను విడుదల చేశారు.
గరుగుబిల్లి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి శుక్రవారం స్వల్పంగా వరద పొటెత్తింది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పైప్రాంతం నుంచి నదిలోకి సుమారు 900 క్యూసెక్కులు చేరింది. ఈ మేరకు శుక్రవారం అధికారులు స్పిల్‌వే గేట్లు తెరిచి.. దిగువ ప్రాంతానికి సుమారు 750 క్యూసెక్కులను విడుదల చేశారు. ప్రస్తుతం తోటపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ 105 మీటర్లకు గాను 104.40 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం దిగువకు వరద నీరు విడుదల చేయడంతో ప్రజల రాకపోకలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. ఈ ఏడాది ఖరీఫ్‌కు సాగునీటి ఇబ్బందులు ఉండవని ప్రాజెక్టు ఈఈ మన్మథరావు తెలిపారు.