Minister Srinivas in top 10 టాప్ 10లో మంత్రి శ్రీనివాస్
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:23 AM
Minister Srinivas in top 10 ల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రుల వారీగా ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం శ్రీనివాస్‌కు టాప్ 10లో స్థానం కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ఉండగా తొలిస్థానంలో డోల బాలవీరాంజనేయస్వామి ఉన్నారు.
టాప్ 10లో మంత్రి శ్రీనివాస్
ఫైల్స్ క్లియరెన్స్‌లో ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం
విజయనగరం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రుల వారీగా ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం శ్రీనివాస్‌కు టాప్ 10లో స్థానం కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ఉండగా తొలిస్థానంలో డోల బాలవీరాంజనేయస్వామి ఉన్నారు. 25వ స్థానంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఉన్నారు. సీఎం చంద్రబాబు ఆరోస్థానంలో ఉండగా మంత్రి నారా లోకేశ్ 9వ స్థానంలో నిలిచారు. 11వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన గుమ్మిడి సంధ్యారాణి 19వ స్థానంలో నిలిచారు. కాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వద్దకు 272 ఫైళ్లురాగా 269 ఫైళ్లకు క్లియరెన్స్ చూపారు.