Share News

వీర జవాన్‌కు మంత్రి నివాళి

ABN , Publish Date - May 11 , 2025 | 11:55 PM

ఆర్మీ జవాన్‌ మురళీనాయక్‌ వీర మరణం పొందిన వార్త రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచి వేసిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

వీర జవాన్‌కు మంత్రి నివాళి
మురళీనాయక్‌ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, మే 11(ఆంధ్రజ్యోతి): ఆర్మీ జవాన్‌ మురళీనాయక్‌ వీర మరణం పొందిన వార్త రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచి వేసిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం సాలూరులో మురళీనాయక్‌ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ సేవలో ప్రాణ త్యాగం చేసిన ఆయన త్యాగం దేశమంతా గర్వపడేలా చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు (చిట్టీ), కూనిశెట్టి భీమారావు, కొనిసి చిన్నా, కారేపు చంద్ర, ఆముదాల పరమేష్‌, హర్షవర్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 11:55 PM