Minister Lokesh to Visit the District 9న జిల్లాకు మంత్రి లోకేశ్ రాక
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:55 PM
Minister Lokesh to Visit the District on 9th రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ నెల 9న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించనున్నారని చెప్పారు.
పార్వతీపురం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ నెల 9న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించనున్నారని చెప్పారు. వారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. జిల్లాలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సకాలంలో వేదిక వద్దకు చేరుకోవాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పర్యటన విజయవంతం చేయండి: మంత్రి
పార్వతీపురంలో మంత్రి లోకేశ్ పర్యటన విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిసారిగా ఆయన ‘మన్యం’ వస్తున్నట్లు తెలిపారు. స్థల పరిశీలన, ఏర్పాట్లు ఇతర అంశాలపై శనివారం జిల్లా ఎమ్మెల్యేలతో చర్చించనున్నట్టు తెలిపారు.
స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే
పార్వతీపురం రూరల్: విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో చిన్నబొండపల్లి గ్రామ పరిధిలో ఎమ్మెల్యే విజయచంద్ర స్థల పరిశీలన చేశారు. విజయవాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మంత్రి నారా లోకేశ్ సభకు ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని భావించారు.
- జిల్లాలో టెన్త్ పరీక్షల్లో ప్రతిభ చూపిన వారు 95 మంది, ఇంటర్‌లో 26 మంది ఉన్నారు. షైనింగ్ స్టార్స్ పేరిట వారిని మంత్రి లోకేశ్ అభినందించనున్నారు.