మైనింగ్ కార్మికుల నిరసన
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:00 AM
మండలంలోని దేవాడ, గుర్ల మండలంలోని సదానందపురంలో ఆర్‌బీఎస్‌ఎస్‌ఎఫ్‌ఎన్ అండ్ దాస్ కంపెనీలో 35 ఏళ్లుగా పనిచేస్తున్న మైనింగ్ కార్మికులు గరివిడి డీఎఫ్‌ఎన్ ప్రాంతం వద్ద మంగళవారం నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో నిరవదిక నిరసన ప్రారంభించారు.
గరివిడి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవాడ, గుర్ల మండలంలోని సదానందపురంలో ఆర్‌బీఎస్‌ఎస్‌ఎఫ్‌ఎన్ అండ్ దాస్ కంపెనీలో 35 ఏళ్లుగా పనిచేస్తున్న మైనింగ్ కార్మికులు గరివిడి డీఎఫ్‌ఎన్ ప్రాంతం వద్ద మంగళవారం నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో నిరవదిక నిరసన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్య దర్శి టీవీ రమణ మాట్లాడుతూ 35 ఏళ్లుగా పనిచేస్తున్న 503 మంది కార్మి కులను విధుల నుంచి తొలగించి సర్వీస్ సెటిల్‌మెంట్ చేస్తామని యాజ మాన్యం పేర్కొనడం తగదన్నారు. లీజులను తిరిగి ప్రభుత్వం పునరుద్ద రించి కార్మికులకు పనులు కల్పించే వరకు తమ ఆందోళనను కొనసాగి స్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎ.గౌరినా యుడు, కె.విశ్వనాథరాజు, అప్పలనాయుడు, సన్యాసినాయుడు, పాపినా యుడు తదితరులు పాల్గొన్నారు.