కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:44 PM
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనంగా రూ.15 వేలు ఇవ్వాలని, పనిభారాన్ని తగ్గించాలని శానిటేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు రామ్మూర్తి నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. సోమవారం రాజాంలో శానిటేషన్ సిబ్బంది తో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం కేవలం రూ. ఆరు వేలు మాత్రమే ఇస్తోందని తెలిపారు.
రాజాం రూరల్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనంగా రూ.15 వేలు ఇవ్వాలని, పనిభారాన్ని తగ్గించాలని శానిటేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు రామ్మూర్తి నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. సోమవారం రాజాంలో శానిటేషన్ సిబ్బంది తో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం కేవలం రూ. ఆరు వేలు మాత్రమే ఇస్తోందని తెలిపారు.
ఫశృంగవరపుకోట, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎస్.కోట ఎంఈవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పఽథక నిర్వాహుకులు, శానిటేషన్ కార్మి కులు సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. అనంతరం ఎంఈవో నర్సింగ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మద్దిల రమణ, చెలికాని ముత్యాలు, జన్ని సన్యాసమ్మ, గౌరి,ఉమామహేశ్వరీ పాల్గొన్నారు.
గ్రీన్ అంబాసిడర్ల సమస్యలు పరిష్కరించాలి
లక్కవరపుకోట, నవంబరు 17(ఆంధ్రజ్యోతి):గ్రీన్ అంబాసిడర్ల సమస్యలు పరిష్కరిం చాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని గ్రీన్ అంబాసిడర్లు నిరసన తెలిపారు. అనం తరం సీఐటీయూ నాయకుడు గాడి అప్పారావు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
జీవో-23 రద్దు చేయాలి
నెల్లిమర్ల, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): పని గంటలను 12 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో- 23 రద్దుచేయాలని ఐఎఫ్‌టీయు జిల్లా నాయకుడు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కాళ్ల అప్పలసూర్తి, నెల్లిమర్ల జ్యూట్ మిల్ కార్మిక సంఘం(ఇఫ్టూ) అధ్యక్షుడు నామాల తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి మద్దిల అప్పలనాయుడు వినతిపత్రం అందజేశారు.
కార్మికుల సమ్మె విరమణ
గజపతినగరం,నవంబరు17(ఆంధ్రజ్యోతి): బకాయివేతనాలను చెల్లించాలని మూడు రోజులుగా సమ్మె బాటపట్టిన పంచాయతీ పారిశుధ్య కార్మికులు సోమవారం సమ్మె విర మించి విధులకు హాజరైనట్లు సంఘనాయకులు నాగేశ్వరరావు, బి.క నకరాజులు తెలిపా రు.రెండునెలలుగా వేతనాలుఅందడంలేదని సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టా రు. సోమవారం గజపతినగరం, పురిటిపెంట పంచాయతీ అధికారులు నెల వేతనం చెల్లించడంతో పాటు రెండోనెలకు సంబందించి గురువారం చెల్లించనున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో జనార్దనరావు తెలిపారు.