కనీస వేతనం ఇవ్వాలి
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:47 PM
అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి రూ.26వేలు కనీస వేతనంగా ఇవ్వాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజాం ప్రోజెక్ట్ గౌరవ అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు డిమాండ్ చేశారు.
రాజాం రూరల్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి రూ.26వేలు కనీస వేతనంగా ఇవ్వాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజాం ప్రోజెక్ట్ గౌరవ అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాజాంలో ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.