ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:44 PM
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి కోరారు
దత్తిరాజేరు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని పెదమానాపురం పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కేసుల వివరాలు, వాటి పురోగతి, స్టేషన్‌లో నిర్వహించే రికార్డులను ఎస్‌ఐ ఆర్.జయంతిని అడిగితెలుసుకునారు. బ్లాక్‌స్పాట్‌లను గజపతినగరం సీఐ జీఏవీ రమణ, ఎస్‌ఐలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏపీఎస్ ఆర్టీసీడ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేసి వారికి రోడ్డు ప్రమాదాలు జరగకుండా బస్సులు నడపాలని సూచించారు.