Share News

Waste Management చెత్తశుద్ధికి చర్యలు

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:02 AM

Measures for Waste Management పార్వతీపురం మున్సిపాల్టీ ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో డంపింగ్‌ యార్డు ఒకటి. అయితే దశాబ్దాల ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది.

  Waste Management  చెత్తశుద్ధికి చర్యలు
రీ సైక్లింగ్‌కు సిద్ధమవుతున్న మిషనరీ

  • త్వరలో ప్రారంభం

పార్వతీపురం/ పార్వతీపురం టౌన్‌, అక్టోబరు28(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మున్సిపాల్టీ ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో డంపింగ్‌ యార్డు ఒకటి. అయితే దశాబ్దాల ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. స్వచ్చంధ్రాప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముున్సిపాల్టీకి ఆర్థిక పరిపుష్టి కలిగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు పట్టణ శివారులో ఉన్న డంపింగ్‌ యార్డులో వ్యర్థాలు, చెత్తలు రీ సైక్లింగ్‌ చేసే యూనిట్‌ను తరుణ్‌ అసోసి యేట్స్‌ అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించింది. దీంతో యుద్ధ ప్రాతిపదిక మిషనరీ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వాస్తవంగా యార్డుకు అనుకొని ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై నుంచి ప్రయాణిం చాలంటే నరకమే. పాదచారులు, వాహనచోదకులు ముక్కు మూసుకుని రాకపోకలు సాగించాల్సిన దుస్థితి. అయితే ఎట్టకేలకు డంపింగ్‌ యార్డుకు ఎదురుగా వ్యర్థాలు, చెత్త రీ సైక్లింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో ప్రజల బాధలు కొంతవరకు తగ్గినట్టేనని చెప్పొచ్చు. ఈ విషయమై మున్సిపల్‌ ప్రజారోగ్యశాఖ డీఈ వంశీకృష్ణను వివరణ కోరగా రీ సైక్లింగ్‌ ప్రక్రియ ప్రారంభిం చేందుకు మిష నరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అసలు జిల్లా కేంద్రమై నాలుగేళ్లు గడుస్తున్న ప్పటికీ డంపింగ్‌ యార్డు తరలింపు అనేది కాగితాలకే పరిమితమైంది. గత వైసీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారిం చలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర డంపింగ్‌ యార్డు సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిలో భాగంగా యార్డులో చెత్త, వ్యర్థాల రీసైక్లింగ్‌తో పాటు సేంద్రియ ఎరువుల తయారీ బాధ్యతను ఓ స్వచ్చంధ సంస్థకు అప్పగించారు. ప్రభుత్వ నిర్ణయంపై పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 29 , 2025 | 12:02 AM