Anemia రక్తహీనత నివారణకు చర్యలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:09 AM
Measures for Prevention of Anemia జిల్లాలో రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రక్తహీనత నివారణలో భాగంగా పౌష్టికాహారం అందించడంతో పాటు ఐసీడీఎస్, డీఆర్‌డీఏ ద్వారా అనేక చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ చెప్పారు.
పార్వతీపురం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రక్తహీనత నివారణలో భాగంగా పౌష్టికాహారం అందించడంతో పాటు ఐసీడీఎస్, డీఆర్‌డీఏ ద్వారా అనేక చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ చెప్పారు. ముఖ్యంగా గర్భిణులకు 21 రకాలతో అదనపు కిట్లును పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎవరైనా రక్తహీనతతో బాధపడుతున్నట్లు తెలిస్తే.. సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామన్నారు. మహిళలు, విద్యార్థినుల ఆరోగ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సీడీపీవో పరిధిలో ముగ్గురు సూపర్‌వైజర్లు, ఐదుగురు అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా ఐసీడీఎస్ ప్రతిపాదించిన లక్ష్య సాధనలో సాధించిన విజయాలను అందరికీ తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో కాల్ సెంటర్
జిల్లాలో యూరియా, ఎరువుల సమాచారం కోసం కలెక్టరేట్‌లో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. కార్యాలయ పనివేళల్లో ఈ 08963 359853 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.