మలేరియా నివారణకు చర్యలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:34 PM
Measures for Malaria Prevention జిల్లాలో మలేరియా నివారణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్‌రావు తెలిపారు. మలేరియా నివారణా మాసోత్సవాల సందర్భంగా డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పార్వతీపురం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా నివారణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్‌రావు తెలిపారు. మలేరియా నివారణా మాసోత్సవాల సందర్భంగా డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమల నిర్మూలనతో మలేరియా నివారించొచ్చన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైడే పాటించాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిసారించామని తెలిపారు. గిరిజన గ్రామాల్లో జ్వర లక్షణాలున్నవారికి వెంటనే వైద్య పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. అనంతరం ఏఎంవో సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఈ సంవత్సరంలో జిల్లాలో 915 మలేరియా ప్రభావిత గ్రామాల్లో దోమల నివారణకు స్ర్పేయింగ్ చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు 465 గ్రామాల్లో స్ర్పేయింగ్ పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు పుష్ప, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.