గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:57 PM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడతామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.
భోగాపురం, నవంబరు29(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడతామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. శనివారం భోగాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో తంగుడిబిల్లికి చెందిన రెడ్డినారాయణరావు, చందకఅప్పలనాయుడు, పల్లిశ్రీను, తదితర 60 కుటుంబాలు జనసేనలో చేరాయి. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి, ప్రజా సేవా కార్యక్రమాలు, నిరంతరం ప్రజల్లో ఉండడం చూసి ప్రజలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు.