Share News

Dairy Development పాడి అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Dec 01 , 2025 | 01:03 AM

Measures for Dairy Development పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పి.కోనవలసలో ఆదివారం ‘ రైతన్నా.. మీకోసం’ ముగింపు కార్యక్రమం నిర్వహించారు.

 Dairy Development పాడి అభివృద్ధికి చర్యలు
పి.కోనవలసలో గ్రామ సచివాలయం, రైతుసేవా కేంద్రాల భవనాలను ప్రారంభిస్తున్న మంత్రి సంధ్యారాణి

పాచిపెంట, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పి.కోనవలసలో ఆదివారం ‘ రైతన్నా.. మీకోసం’ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పాడి అభివృద్ధిలో భాగంగా పాచిపెంట మండలానికి రెండు వందల గోకులాలు మంజూరు చేశాం. రైతులు ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగించాలి. ప్రతిఒక్కరూ అపరాలు సాగుపై దృష్టి సారించాలి. సాలూరు నియోజకవర్గానికి రూ. 20 కోట్లతో 40 హెల్త్‌ సెంటర్లు మంజూరు చేశాం. వీటిల్లో మక్కువ మండలానికి 9, పాచిపెంటకు 15, సాలూరుకు 16 భవనాలు చొప్పున మంజూరయ్యాయి. రాజకీయంగా ఎదుగుల, అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నంతవరకు నా ఎదుగుదలను ఎవరూ ఆపలేరు.’ అని తెలిపారు. అనంతరం పి.కోనవలసలో గ్రామ సచివాలయం, రైతుసేవా కేంద్ర భవనాలను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఏఎంసీ చైర్మన్‌ ముఖి సూర్యనారాయణ, సాలూరు, పాచిపెంట, మక్కువ టీడీపీ నాయకులు యుగంధర్‌, తిరుపతిరావు, వేణుగోపాలరావు, పరమేశు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 01:03 AM