Share News

Boat Rides బోటు షికారుకు చర్యలు

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:59 PM

Measures for Boat Rides తోటపల్లి ప్రాజెక్టు పరిధి నాగావళి నదిలో బోటు షికారుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన సుంకి పంచాయతీలో తోటపల్లి కుడి మట్టికట్ట, ఐటీడీఏ పార్కును పరిశీలించారు.

  Boat Rides బోటు షికారుకు చర్యలు
నాగావళి నదిలో గుర్రపు డెక్కను పరిశీలిస్తున్న జేసీ యశ్వంత్‌రెడ్డి

గరుగుబిల్లి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పరిధి నాగావళి నదిలో బోటు షికారుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన సుంకి పంచాయతీలో తోటపల్లి కుడి మట్టికట్ట, ఐటీడీఏ పార్కును పరిశీలించారు. పూర్తిస్థాయిలో పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పార్కు పరిధిలో పలు రకాల సామగ్రి కొంతమేర పనికిరాని విధంగా తయారుకావడం చూసి.. ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చి దిద్దాలన్నారు. పర్యాటకుల సంఖ్యను పెంచాలని సూచించారు. అనంతరం నాగావళి నది ప్రాంతంలో మూలకు చేరిన బోట్లు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గుర్రపు డెక్క, పిట్ట తామరను తొలగించి బోటు షికారుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఐటీడీఏ జేఈ తిరుపతిరావు, పర్యాటక సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:59 PM