మోనూ ప్రకారం భోజనం అందించాలి
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:40 PM
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథ కం అమలు చేయాలని చీపురుపల్లి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి కేవీ రమణ కోరారు. సోమవారం మెరకముడిదాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల యాక్షన్‌ప్లాన్‌పై సమీక్షించారు.
మెరకముడిదాం,నవంబరు 17(ఆంధ్రజ్యోతి):మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథ కం అమలు చేయాలని చీపురుపల్లి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి కేవీ రమణ కోరారు. సోమవారం మెరకముడిదాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల యాక్షన్‌ప్లాన్‌పై సమీక్షించారు. అనంతరం మధ్యాహ్న భోజనపథకం అమలును పరిశీలించారు.కార్యక్రమంలో ఎంఈవో ఎం.చంద్ర శేఖర్, హెచ్‌ఎం ఎస్.తిరుపతిరావు పాల్గొన్నారు.