Maternal Deaths మాతృ మరణాలు సంభవించరాదు
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:36 PM
Maternal Deaths Must Be Prevented జిల్లాలో గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపా లని, మాతృ మరణాలు సంభవించకుండా చూడాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశిం చారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎండీఆర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
పార్వతీపురం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపా లని, మాతృ మరణాలు సంభవించకుండా చూడాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశిం చారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎండీఆర్ కమిటీ సమావేశం నిర్వహించారు. గత నెలలో సంభవించిన గర్భిణుల మృతిపై సమీక్షించారు. గర్భిణుల నమోదు, వైద్య పరీక్షలు, ఆరోగ్య తనిఖీలు, పర్యవేక్షణ, ఏ ఆరోగ్య సమస్య కారణంగా రెఫర్ చేశారనే తదితర విషయాలను అన్నవరం పీహెచ్‌సీ వైద్యాధికారి, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రెఫరల్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ ఆ సమయంలో గర్భిణికి తలెత్తిన ఆరోగ్య సమస్యలు, అందజేసిన చికిత్స వివరాలను తెలియజేశారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. గర్భిణుల ఆరోగ్య రీత్యా వైద్య ఆరోగ్యశాఖ నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, సూపరింటెండెంట్ నాగశివజ్యోతి, జిల్లా ప్రోగ్రాం అధికారులుజగన్మోహన్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.