రెవెన్యూశాఖలో భారీగా బదిలీలు
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:23 AM
జిల్లా రెవెన్యూశాఖలో తహసీల్దార్ నుంచి వీఆర్వో వరకు బదిలీలు జరిగాయి. విజయనగరం జిల్లా నుంచి మన్యం జిల్లాకు, అక్కడి నుంచి ఈ జిల్లాకు ఉద్యోగులను బదిలీ చేశారు.
విజయనగరం/కలెక్టరేట్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): జిల్లా రెవెన్యూశాఖలో తహసీల్దార్ నుంచి వీఆర్వో వరకు బదిలీలు జరిగాయి. విజయనగరం జిల్లా నుంచి మన్యం జిల్లాకు, అక్కడి నుంచి ఈ జిల్లాకు ఉద్యోగులను బదిలీ చేశారు. గురువారం రాత్రి ఉద్యోగులను బదిలీ చేస్తూ కలెక్టరు ఉత్తర్వలు జారీ చేశారు. 11 మంది తహసీల్దార్లు, 21 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 27 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, 39 మంది గ్రేడ్-1 వీఆర్వోలు, 50 మంది గ్రేడ్-2 వీఆర్వోలు బదిలీ అయిన వారిలో ఉన్నారు. మొత్తం 153 మంది బదిలీ అయ్యారు. నెలిమర్ల తహసీల్దారు సుదర్శనరావును సంతకవిటికి, మెంటాడ తహసీల్దారు శ్రీనివా సరావు ఎల్.కోటకు, ఎస్.కోట తహసీల్దారు అరుణకుమారిని మెంటాడకు, జామి తహసీల్దారు ఐ.కృష్ణలతను రేగిడి ఆమ దాలవలసకు, రాజాం తహసీల్దారు కృష్ణంరాజును జామికి బది లీ చేశారు. అలాగే కలెక్టరేట్‌లో ఏవో ఎల్‌ఆర్‌గా పనిచేస్తున్న ఎ.శ్రీకాంత్‌ను నెలిమర్లకు, డెంకాడ తహసీల్దారు పద్మా వతిని వంగరకు, వంగరలో పనిచేస్తున్న డి.ధర్మరాజును డెంకాడకు, విజయనగరం ఏవో పనిచేస్తున్న డి.శ్రీనివాస రావును ఎస్.కోటకు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మిశ్రాను విజయనగరం ఆర్డీవో కార్యాలయం ఏవో బదిలీ చేశారు. పూసపాటిరేగ తహసీల్దారు గోవిందను కలెక్టరేట్ సి.సెక్షన్ సూపరింటెండెంట్‌గా, శ్రీకాకుళం కలెక్టరేట్ సూపరిం టెండెంట్ రాజశేఖర్‌ను రాజాం తహసీల్దారుగా నియమించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో పనిచేస్తున్న అప్పలరాజును కొత్తవలసకు, కురుపాం తహసీల్దారు ఎం.రమణమ్మను భోగాపురానికి, సాలూరు తహసీల్దారు ఎన్‌వీ రమణను పూసపాటిరేగకు బదిలీ చేశారు. సంతకవిటి తహసీల్దారు పి.సత్యంను శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారు. ఎల్.కోట తహసీల్దారు బీఎంజీఎన్ ప్రసా దరావు, కొత్తవలస తహసీల్దారు నీలకంఠరావు, భోగాపురం తహసీల్దారు ఎన్.సురేష్‌ను మన్యం జిల్లాకు కేటాయిస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. మరికొంతమంది తహసీల్దార్లు, డీటీలను కూడా జిల్లాలను మార్చారు.