Share News

విద్యుదాఘాతంతో తాపీమేస్త్రీ మృతి

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:32 PM

విద్యుదాఘాతంతో తాపీమేస్త్రీ మృతి చెందిన ఘటన మక్కువ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో తాపీమేస్త్రీ మృతి

మక్కువ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో తాపీమేస్త్రీ మృతి చెందిన ఘటన మక్కువ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఎం.పాలికవలస గ్రామానికి పాల గౌరు(39) తాపీమేస్త్రీగా జీవనం సాగిస్తున్నా డు. ఈక్రమంలో మక్కువ బీసీ కాలనీకి చెందిన మామిడి ఆనందరావు ఇంటి నిర్మాణానికి కాంట్రాక్టు తీసుకున్నాడు. ఆదివారం ఆనందరావు ఇంటి శ్లాబ్‌ను పరిశీలించేందుకు గౌరు మేడపైకి వెళ్లాడు. పరిశీలన అనంతరం కిందకు దిగుతుండగా ఇంటి పక్కనే వేలాడుతున్న హెచ్‌టీ లైన్‌ అతడికి తగిలింది. దాంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య పైడితల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణమూర్తి కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 14 , 2025 | 11:32 PM