Share News

భవనం పైనుంచి పడి తాపీమేస్త్రి మృతి

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:03 AM

మెంటాడ మండల కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వ హైస్కూల్‌ భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఓ తాపీ మేస్త్రీ మృతిచెందాడు.

 భవనం పైనుంచి పడి తాపీమేస్త్రి మృతి

మెంటాడ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మెంటాడ మండల కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వ హైస్కూల్‌ భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఓ తాపీ మేస్త్రీ మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అడపాక గ్రామానికి చెందిన గురజాపు అప్పారావు (32) అనే తాపీ మేస్త్రి భవనం పై నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను వెంటనే గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆండ్ర ఎస్‌ఐ సీతారాం తెలిపారు.

Updated Date - Aug 16 , 2025 | 01:03 AM