Share News

ఇంజక్షన్‌ వికటించి వివాహిత మృతి

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:08 AM

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రం కొత్తూరులోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి ఓ వివాహిత మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది.

ఇంజక్షన్‌ వికటించి వివాహిత మృతి

  • పరారైన పీఎంపీ

  • ఆందోళన చేసిన కుటుంబ సభ్యులు

కొత్తూరు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రం కొత్తూరులోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి ఓ వివాహిత మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన తేజాలమ్మ(53) తన భర్త తవుడుతో కలిసి గురువారం మధ్యాహ్నం చికిత్స కోసం కొత్తూరు నాలుగు రోడ్ల జంక్షన్‌లో గల శ్రీసాయి ప్రజా వైద్యశాలలో గల వైద్యుడు నాగేశ్వరరావు (పీఎంపీ) వద్దకు వచ్చారు. తనకు కాళ్లు పీకులు, నొప్పులు ఉన్నాయని వైద్యుడుకి వివరించింది. సమస్య విన్న వైద్యుడు నాగేశ్వరరా వు ఆమెకు ఇంజక్షన్‌ చేస్తుండగానే కుప్ప కూలి ప్రాణాలు విడిచింది. ఇది గమనించి వైద్యుడు ఆమె పరిస్థితి విషమంగా ఉందని, తక్షణమే వేరే ఆసుప త్రికి తీసుకుని వెళ్లాలని ఆమె భర్తకు చెప్పి తప్పించుకోవాలనుకున్నాడు. వైద్యుడి కపటితనాన్ని గుర్తించిన ఆమె భర్త తవుడు తన ఎదుటే ప్రాణం విడిసిందని కేకలు వేస్తూ ఏడ్చాడు. దీంతో వైద్యు డు మృతదేహాన్ని బెడ్‌పైనే ఉంచేసి ఆసుపత్రికి తాళాలు వేసి వెళ్లిపోయాడు. ఈ విషయం మృతిరాలి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా ఆసు పత్రి వద్దకి చేరుకుని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐ సీహెచ్‌ ప్ర సాద్‌, ఎస్‌ఐ ఎండీ అమీరు ఆలీ సిబ్బంది తో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులో ఉండేలా జా గ్రత్తలు తీసుకున్నారు. కాగా ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో కలెక్టర్‌, ఎస్పీలు స్పందించి తక్షణ మే నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో కురి గాం ఆసుపత్రి వైద్యులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి నివేదిక ఉన్నతాధికారులకు అందించిన ట్టు తెలుస్తుంది. ఆసుపత్రి ఏర్పాటుకు అవసర మైన అన్ని అనుమతులు ఉన్నాయా? లేవా? వంటి విషయాలపై ఆరా తీస్తు న్నారు. ఆసుపత్రి వద్ద సు మారు నాలుగు గంటల పాటు హైడ్రామా నడిచిం ది. బాధితులకు న్యాయం చేసేందుకు వైద్యుడితో రాజీ కుదిర్చేందుకు పలువురు ప్రయత్నించినా ఫలించకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేం దుకు పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కాగా తేజాల మ్మకి భర్త తోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరంతా ఇతర ప్రాంతాల్లో ఉంటూ జీవనోపాధి పొందుతున్నారు. తవుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎండీ అమీర్‌ ఆలీ తెలిపారు.

Updated Date - Sep 12 , 2025 | 12:08 AM