Share News

వివాహిత ఆత్మహత్య

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:20 AM

వివాహిత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేటలో సోమవారం చోటుచేసుకుంది.

వివాహిత ఆత్మహత్య

రాజాం రూరల్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): వివాహిత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేటలో సోమవారం చోటుచేసుకుంది. దీనిపై రాజాం టౌన్‌ సీఐ కె.అశోక్‌కుమార్‌ అంద జేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఔరంగాబాద్‌కు చెందిన మహమ్మద్‌ జఫిన్‌ గత 17 ఏళ్లుగా రాజాం ప్రాంతంలో ఉంటూ మార్బుల్స్‌ వర్క్‌ చేసుకుంటూ జీవి స్తున్నాడు. ఐదేళ్ల కిందట బీహార్‌కు చెందిన హీనా పర్వీన్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరు రెండేళ్ల నుంచి డోలపేటలో ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. ఇటీవ ల హీనాకు ఆరోగ్యం బాగోలేదు. ఈనెల 12న ఆమె మందులు వేసుకోలేదు. దీం తో జఫిన్‌ సోమవారం ఉదయం ఆమెను మందలించాడు. ఆ తర్వాత పనుల కోసం బయటకు వెళ్లిపోయాడు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి చేరేసరికి.. భార్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని, మృతిచెంది ఉంది. దీంతో జఫిన్‌ రాజాం పొలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సీఐ అశోక్‌కుమార్‌ కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మృతురాలి కుటుంబ సభ్యులు హీనాది ఆత్మహత్య కాదని, ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు బీహార్‌ నుంచి వచ్చేంత వరకూ హీనా మృతదేహాన్ని రాజాం ఏరియా ఆసుపత్రిలో ఉంచే ఏర్పాట్లు చేశా మని సీఐ తెలిపారు. జఫిన్‌, హీనా దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్దకొడుకు వసీం బీహార్‌లో ఉండగా.. రెండో కుమారుడు కాసిం డోలపేటలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు.

Updated Date - Oct 14 , 2025 | 12:20 AM