Share News

గంజాయి విక్రయదారుల అరెస్టు

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:26 AM

నగరంలోని వ్యాసనారాయణ మెట్ట సమీపంలోని గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఏడున్నర కేజీల గంజా యిని స్వాధీనం చేసుకున్నట్లు టూ టౌన్‌ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు.

గంజాయి విక్రయదారుల అరెస్టు

విజయనగరం క్రైం, నవంబరు13 (ఆంధ్రజ్యోతి): నగరంలోని వ్యాసనారాయణ మెట్ట సమీపంలోని గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఏడున్నర కేజీల గంజా యిని స్వాధీనం చేసుకున్నట్లు టూ టౌన్‌ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఉదయం పోలీసులకు వచ్చిన సమాచారంతో ఆ ప్రాంతానికి చేరుకుని గంజాయిని విక్రయంచేందుకు సిద్ధంగా వైఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన మల్లిబోయిన మురళీకృష్ణ, కొత్తపేట యాదవ వీధికి చెందిన మక్కిళ్ల పవన్‌కుమార్‌, రణస్థలానికి చెందిన గణేశ్వరం సంజయ్‌ కుమార్‌, యాగాటి గణేష్‌, బాబామెట్ట పీవీజీ నగర్‌కు చెందిన పడగల రాజేశ్‌లను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. దాంతో వారు నేరం చేసినట్లు అంగీకరించారని సీఐ తెలిపారు. దాడిలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ కనకరాజు, హెచ్‌సీ తిరుపతి, రామునాయుడు ,వి.కృష్ణ, శ్రీనివాసరావులను సీఐ అభినందించారు.

Updated Date - Nov 14 , 2025 | 12:26 AM