గంజాయి స్వాధీనం.. నలుగురు మహిళల అరెస్టు
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:29 AM
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు మహిళలను పట్టుకుని, అరెస్టు చేశామని జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీరావు తెలిపారు.
విజయనగరం క్రైం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు మహిళలను పట్టుకుని, అరెస్టు చేశామని జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీరావుతో పాటు ఆర్పీఎఫ్ సిబ్బంది గురువారం తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మహరాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన గీతా సంజయ్ చౌహన్, పారుభాయ్ సంజయ్ చౌహన్, రజనీ భీమాపవర్, వైశాలి కాలే అనే నలుగురు మహిళలు గంజాయితో పట్టుబడ్డారు. ఒడిశా రాష్ట్రం బరంపురం నుంచి మహరాష్ట్రకు అక్రమంగా వీరు సుమారు రూ.4లక్షలు విలువైన 40కిలోల గంజాయిని తరలిస్తున్నారు. వీరిని పోలీసులు గుర్తించి, పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.