Share News

mustabhu… మన్యం ‘ముస్తాబు’.. ఇక రాష్ట్రమంతా!

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:30 AM

Manyam mustabhu… Now the Whole State! విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ‘ముస్తాబు’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మదిని దోచిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆదేశాలతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ‘ముస్తాబు’కు శ్రీకారం చుట్టారు.

  mustabhu…  మన్యం ‘ముస్తాబు’..  ఇక రాష్ట్రమంతా!
ముస్తాబు కార్య క్రమాన్ని పరిశీలిస్తున్న జేసీ

పార్వతీపురం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ‘ముస్తాబు’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మదిని దోచిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆదేశాలతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ‘ముస్తాబు’కు శ్రీకారం చుట్టారు. మరోవైపు జిల్లాలోని అన్ని విద్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో అధికారులు, ప్రజాప్ర తినిధులు భాగస్వాములయ్యారు. మొత్తంగా మన్యంలో ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావడం.. దీనిపై పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేయడంపై ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో ఆనందంగా ఉంది

‘జిల్లాలో అమలవుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలు ఇచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా నిర్వహిస్తున్నాం. పిల్లలు ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణతో విద్యనభ్యసించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

ఇదే స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి చేస్తా..

‘ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారంతో కార్యక్రమాలు చేపడతాం.’ అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

ముస్తాబుతో విద్యార్థుల ఆరోగ్యంలో మార్పు : జేసీ

పార్వతీపురం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ముస్తాబుతో విద్యార్థుల ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చిందని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం పార్వతీపురం చాకలి బెలగాంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని పరిశీలించారు విద్యార్థుల చదువుపైనే కాకుండా ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం పాఠశాలల్లో ఆనందలహరి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ కార్య క్రమంలో పిల్లలతో నృత్య ప్రదర్వనలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉదయం ప్రార్థనలో యోగా, ఏరోబిక్స్‌ చేయించడం తప్పనిసరి అని తెలిపారు. విద్యార్థులకు ఆహ్లదకర, ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యను అందించడమే ఈ ముస్తాబు కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు. ఏటీడబ్ల్యూవో కృష్ణవేణి, గిరిజన సంక్షేమశాఖాధికారులు తదితరులు ఉన్నారు.

ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా మారుద్దాం

ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా మార్చాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మున్సిపల్‌, పరి శ్రమలు, కాలుష్య నియంత్రణ, ఇతర అధికారులతో సమీక్షించారు. మార్కెట్లు, దుకాణాలు, గ్రామీణ వారపు సంతల్లో ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వినియోగం అధికంగా ఉందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి... జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్‌ తయారీ యూనిట్లపై దాడులు చేయాలని ఆదేశించారు. నిబంధలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించాలన్నారు. కేవలం జరిమానాలే కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలని సూచించారు.

Updated Date - Dec 21 , 2025 | 12:30 AM