Share News

మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:05 AM

బదిలీలకు సంబంధించి మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ఈ మేరకు బొబ్బిలి, రామభద్రపురం ఎంఈవోకార్యాలయాల వద్ద ఉపాధ్యాయ సంఘాల నాయకులు శనివారం నిరసన తెలిపారు.

మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి
రామభద్రపురం: నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

బదిలీలకు సంబంధించి మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ఈ మేరకు బొబ్బిలి, రామభద్రపురం ఎంఈవోకార్యాలయాల వద్ద ఉపాధ్యాయ సంఘాల నాయకులు శనివారం నిరసన తెలిపారు.

ఫబొబ్బిలి రూరల్‌, జూన్‌7 (ఆంధ్రజ్యోతి): హామీ మేరకు ఉపాధ్యాయుల బదిలీలు మాన్యువల్‌ పద్ధతిలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉపాధ్యాయు సంఘాల నాయకులు కోరారు. వెబ్‌ఆప్షన్లకు బాయ్‌కాట్‌ చేయాలని తెలిపారు. ఈమేరకు శనివారం బొబ్బిలి ఎమ్మార్సీ కార్యాలయం వద్ద యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకురాలు విజయగౌరి,ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లా డుతూ ప్రధానంగా వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఇప్పటికే పలు పొరపాట్లు జరుగుతుండడంతో టీచర్లు నష్టపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. పదిరోజుల కిందట ప్రభుత్వం ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని హామీఇచ్చి, వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవా లని పేర్కొనడం మాట తప్పడమేనని ఆరోపించారు. వెబ్‌ ఆప్షన్‌ విధానాన్ని వెనక్కు తీసుకోకపోతే జిల్లావిద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంఈవోకు వినతిపత్రం అందజే శారు. కార్యక్రమంలో నాయకులు, విజయగౌరి, శ్రీనివాస్‌, రామారావు, సుధాకర్‌, మహేష్‌ పాల్గొన్నారు.

ఫరామభద్రపురం, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ఎస్‌జీటీలకు మ్యాన్వుల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తేనే ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని యుటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు కె.ప్రసన్నకు మార్‌ తెలిపారు. శనివారం రామభద్రపురం మండల విద్యా శాఖ కార్యాలయం వద్ద వెబ్‌కౌన్సెలింగ్‌కు వ్యతిరేకంగా ఉపా ధ్యాయ సంఘ నాయకులు బొప్పే రవికుమార్‌, ముసలయ్య, వెంకటరావు, కర్రి శ్రీనివాసరావు నిరసన తెలిపారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ వెబ్‌కౌన్సెలింగ్‌ను అన్నిఉపాధ్యాయ సంఘాలు బహిష్కరిస్తున్నాయని తెలిపారు.

Updated Date - Jun 08 , 2025 | 12:06 AM