ఖేలో ఇండియా పోటీల్లో మణికంఠ ప్రతిభ
ABN , Publish Date - May 11 , 2025 | 12:03 AM
బీహార్ రాష్ట్రం రాజగిరిలో జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో సీతంపేట మండలం జిల్లేడుపాడు గ్రామానికి చెందిన పాలక మణికంఠ ప్రతిభ కనబరిచాడు.
సీతంపేట రూరల్, మే 10 (ఆంధ్రజ్యోతి): బీహార్ రాష్ట్రం రాజగిరిలో జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో సీతంపేట మం డలం జిల్లేడుపాడు గ్రామానికి చెందిన పాలక మణికంఠ ప్రతిభ కనబరిచాడు. మణికంఠ ఆంధ్రప్రదేశ్ టీంకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ పోటీల్లో ఏపీ టీం కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా మణికంఠకు జిల్లా కబడ్డీ అసోసి యేషన్ గౌరవాధ్యక్షుడు పల్లా కొండలరావు, ప్రెసిడెంట్ కోడి సుదర్శనరావు, సెక్రటరీ వెన్నపు చంద్రరావు, అసోసియేషన్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు శనివారం అభినందనలు తెలిపారు.