జంట హత్యల కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:03 AM
మక్కువ మండలంలోని చెముడు పంచాయతీ పాలికవలసలో 2018లో నమోదైన జంట హత్యల కేసులో గిన్నిపల్లి సింహాద్రికు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయాధికారి ఎస్.దామోదరరావు సోమవారం తీర్పు వెల్లడించారని ఎస్పీ మాధవరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
మక్కువ/ బెలగాం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మక్కువ మండలంలోని చెముడు పంచాయతీ పాలికవలసలో 2018లో నమోదైన జంట హత్యల కేసులో గిన్నిపల్లి సింహాద్రికు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు న్యాయాధికారి ఎస్.దామోదరరావు సోమవారం తీర్పు వెల్లడించారని ఎస్పీ మాధవరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మక్కువ మండలం పలికివలస గ్రామానికి చెందిన ఒమ్మి పైడిరాజు తన తల్లితండ్రులు ఒమ్మి సోములు, నారాయణమ్మలను అదే గ్రామానికి చెందిన గిన్నిపల్లి సింహాద్రి హత్య చేశాడని మక్కువ పోలీస్ స్టేషన్‌లో 2018లో ఫిర్యాదు చేయగా పోలీసు లు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు సింహాద్రిపై నేరం రుజువు కావడంతో న్యాయాధికారి శిక్ష ఖరారు చేశారన్నారు. సంబంధిత నేర శోధనకు కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.