కెరటాంలో వ్యక్తి హత్య?
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:30 AM
మండలంలోని కెరటాం గ్రామంలో నెడుగట్టి అప్పలకృష్ణ(45) ఆదివా రం మృతిచెందాడు.
మేనల్లుడే చంపాడని భార్య ఆరోపణ
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
పాతిపెట్టిన మృతదేహం వెలికితీత
బొండపల్లి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని కెరటాం గ్రామంలో నెడుగట్టి అప్పలకృష్ణ(45) ఆదివా రం మృతిచెందాడు. కుటుంబీకులు మద్యం అతిగా తాగడం వల్ల మృతిచెందాడని వారి మత సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. మృతుని భార్య రాజు, మేన ల్లుడు నారపాటి సాయి హత్య చేసి ఉంటారని మృతు డి బంధువు పిల్లి సురేష్ ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక ఎస్‌ఐ యు.మహేష్, తహసీల్దార్ డి.రాజేశ్వరరావుల సమక్షంలో గజపతినగరం ప్రభుత్వ వైద్యాధికారి రామకృష్ణరాజు సోమవారం మృతిదేహాన్ని వెలికితీసి అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహిం చారు. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐను వివరణ కోరగా.. మృతుడు భార్య రాజుకు, సాయికి సన్నిహి త సంబంధం ఉందని, పలుమార్లు అప్పలకృష్ణ, సాయి మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఈనేపథ్యంలో సన్నిహిత సంబంధమే హత్యకు కారణ మని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశా మని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు నిర్వహిస్తామన్నారు.
మృతుడి భార్య రాజు విలేకర్లతో మాట్లాడుతూ తన మేనల్లుడు నారుపాటి సాయి, తాను మూడేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నామని, ఈ విషయమై తన భర్త, సాయి మధ్య ఘర్షణలు జరిగాయని తెలిపారు. సాయి ఏడాది కాలంగా తమ ఇంట్లోనే ఉంటున్నాడని, శనివారం రాత్రి తన భర్తతో పాటు సాయి బయటకు వెళ్లారని, తిరిగి 12 గంటలకు సాయి ఒక్కడే ఇంటికి వచ్చాడని చెప్పారు. మావయ్య ఎక్కడా? అని అడిగితే మద్యంమత్తులో ఉండి పోయాడని చెప్పాడని, ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న అప్పలకృష్ణను ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టారని ఆమె తెలిపారు. ఉదయం చూసేసరికి తన భర్త చనిపోయాడని ఆమె చెప్పారు. సాయి బెదిరించడంతో తన భర్తకు అంత్రక్రియలు నిర్వహించామని, చంపింది సాయేనని ఆమె ఆరోపిస్తున్నారు.