Share News

దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:46 PM

దాడి ఘటనలో గాయపడిన వ్యక్తి మృతిచెందడంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్పు చేసినట్టు సీఐ షణ్ముఖరావు ఆదివారం తెలిపారు.

 దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

  • హత్య కేసుగా నమోదు

కొత్తవలస, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): దాడి ఘటనలో గాయపడిన వ్యక్తి మృతిచెందడంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్పు చేసినట్టు సీఐ షణ్ముఖరావు ఆదివారం తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస మంగళ వీధిలో నివాసం ఉంటున్న జంగంపల్లి ప్రసాద్‌, సూరిశెట్టి రవితేజ అనే ఇద్దరు స్నేహితులు ఈనెల 7వ తేదీన మద్యం తాగారు. మద్యం మత్తులో రవితేజ.. ప్రసాద్‌ జేబులో చేయి పెట్టి 100 రూపాయలను తీసుకున్నాడు. ఆ డబ్బులతో రవితేజ చికెన్‌ కొనుక్కుని ఇంటికి పట్టుకుపోయాడు. ఆ చికెన్‌ కోసం ప్రసాద్‌.. రవితేజ ఇంటికి వెళ్లి తిరిగి తెచ్చుకున్నాడు. మద్యం మత్తులోనున్న రవితేజ ఆగ్రహంతో ఊగిపోయి ప్రసాద్‌ ఇంటికి వెళ్లి, కూరగాయలు కోసుకునే చాకుతో పలు చోట్ల గాయపర్చాడు. దీంతో గాయపడిన ప్రసాద్‌ను చికిత్స నిమిత్తం విశాఖపట్టణం కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు బాధితుడి భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూరిశెట్టి రవితేజపై పోలీసులు హత్యాహత్య యత్నం కేసునమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి కొత్తవలస కోర్టులో హాజరు పర్చారు. 14 రోజులపాటు జుడీషియల్‌ కస్టడీలో ఉంచాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. శనివారం సాయంత్రం చికిత్స పొందుతున్న ప్రసాద్‌ మృతిచెందాడు. దీంతో హత్యా యత్నం కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

Updated Date - Oct 12 , 2025 | 11:46 PM