వట్టిగెడ్డలో వ్యక్తి గల్లంతు
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:04 AM
దుగ్ధసాగరం సమీపంలోని వట్టిగెడ్డ దాటుతూ వ్యక్తి గల్లంతైన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
సాలూరు రూరల్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): దుగ్ధసాగరం సమీపంలోని వట్టిగెడ్డ దాటుతూ వ్యక్తి గల్లంతైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. దుగ్ధసాగరం గ్రామానికి చెందిన ఎం.రామయ్య (45) మధ్యాహ్నం భోజనం చేసి వట్టిగెడ్డ దాటి పొలానికి వెళ్లారు. ఆయన పొలంలో పనిచేసుకుని సాయంత్రం ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఎగువప్రాంతంలో కురిసిన భారీవర్షానికి వట్టిగెడ్డకు వరద వచ్చింది. ఆయనకు ఈత రావడంతో ఇంటికి చేరుకోవడానికి వట్టిగెడ్డలో దిగారు. ఈత కొడుతున్న ఆయన వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.