పోక్సో కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:08 AM
బాలికను వేధించి, అసభ్యకరమైన వ్యా ఖ్యలు చేసిన కేసులో కంకణాల కిరణ్‌కు విజయనగరం పోక్సో కోర్టు న్యాయాధి కారి కె.నాగమణి మూడేళ్ల జైలు, రూ.2వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారని ఎస్‌ఐ సాగర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
తెర్లాం, సెప్టెంబరు12 (ఆంధ్రజ్యోతి): బాలికను వేధించి, అసభ్యకరమైన వ్యా ఖ్యలు చేసిన కేసులో కంకణాల కిరణ్‌కు విజయనగరం పోక్సో కోర్టు న్యాయాధి కారి కె.నాగమణి మూడేళ్ల జైలు, రూ.2వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారని ఎస్‌ఐ సాగర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. మండలానికి చెం దిన ఓ బాలిక ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన ఫిర్యాదుపై అప్పట్లో కంకణాల కిరణ్‌పై కేసు నమోదు చేశామన్నారు. కేసు విచారణ పూర్తికావడంతో కిరణ్‌కు న్యాయాధికారి శిక్ష ఖరారు చేశారని ఎస్‌ఐ తెలిపారు. బాధితురాలికి రూ.25వేలు పరిహారం చెల్లింపునకు న్యాయాధికారి ఆదేశించారని ఎస్‌ఐ వివరించారు.