రేబీస్‌తో వ్యక్తి మృతి
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:25 AM
రేబీస్ వ్యాధితో ఓ వ్యక్తి మృతిచెందా రు.
సంతకవిటి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): రేబీస్ వ్యాధితో ఓ వ్యక్తి మృతిచెందా రు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని గోవిందపురం గ్రామానికి చెందిన అదపాక లింగంనాయుడు(37) నెల రోజుల కిందట వీధికుక్క దాడిలో గాయపడ్డారు. వెంటనే సంతకవిటి పీహెచ్‌సీకి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు. నెల రోజుల తర్వాత సెప్టెంబరు 25న అనారోగ్యం బారిన పడ్డారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్య పరీక్షల్లో రేబీస్ వ్యాధి వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కుటుంబీకులు లింగంనాయుడును విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం లింగంనాయుడు మృతిచెందారు. ఈయనకు భార్య హేమలత ఉంది.