విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:25 AM
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కొండచాకరాపల్లిలో సోమవారం చోటుచేసుకుంది.
వంగర, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కొండచాకరాపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పారిశర్ల వెంకటరమణ(52) వర్షాలు కురుస్తున్నందున తన పొలంలో నిలిచిన నీటిని బయటకు వదిలేందుకు వెళ్లాడు. పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ వైరు కాలికి తగిలింది. దీంతో ఆయన విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య శ్రీదేవి, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కుటుంబీకుల పోలీసులకు సమాచారం అందజేశారు.