విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:02 AM
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.
కొమరాడ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని విక్రంపురం గ్రామానికి చెందిన ఉబ్బిశెట్టి చిట్టిబాబు(60) శుక్రవారం తన ఇంట్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో విద్యుత్ మీటర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా.. షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. ఈయన భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, కుమార్తెకు వివాహం అయ్యింది.