పాము కాటుతో వ్యక్తి మృతి
ABN , Publish Date - Aug 02 , 2025 | 01:16 AM
మండలంలోని పుల్లిట గ్రామానికి చెందిన జామి పట్టాభి(38) శుక్రవారం పాముకాటుకు గురై మృతి చెందాడు.
సంతకవిటి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని పుల్లిట గ్రామానికి చెందిన జామి పట్టాభి(38) శుక్రవారం పాముకాటుకు గురై మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం తమ పొలంలో బెండకాయలు ఏరుతుండగా పాము కాటు వేసింది. కుటుంబీకులు వెంటనే పట్టాభిని రాజాం ఆసుపత్రికి తరలిం చారు. చికిత్స పొందుతూ పట్టాభి మృతిచెందాడు. ఈయనకు భార్య భవానితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.