చెరువులో పడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:28 AM
ఎం.ఆర్.నగరంలోని చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.
పార్వతీపురం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎం.ఆర్.నగరంలోని చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని ఉండి భీమవరానికి చెందిన వి.గౌరీశంకరరావు నాలుగు నెలలుగా కుటుంబంతో ఎం.ఆర్.నగరంలో ఉంటున్నాడు. బుధవారం ప్రమాదశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సంతోష్ కేసు నమోదు చేశారు.