చెరువులో పడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:56 PM
సవరవల్లి పంచాయతీ బుత్తలపేట కు చెందిన బుత్తల లక్ష్మణ(40) అనే వ్యక్తి చెరువులో పడి మృతిచెందారు.
భోగాపురం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): సవరవల్లి పంచాయతీ బుత్తలపేట కు చెందిన బుత్తల లక్ష్మణ(40) అనే వ్యక్తి చెరువులో పడి మృతిచెందారు. దీనిపై ఎస్‌ఐ పి.సూర్యకుమారి ఆదివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుత్తలపేటకు చెందిన బుత్తల కొండమ్మ, లక్ష్మణ అనే భార్యభర్తలు కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే లక్ష్మణ శనివారం రాత్రి బయటకు వెళ్లి వస్తానని ఇంటి దగ్గర చెప్పి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఈక్రమంలో ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని చెరువులో మృతదేహం తేలి ఆడుతూ కనిపిం చింది. విషయం తెలుసుకున్న లక్ష్మి.. వెంటనే అక్కడకు వెళ్లి మృతదేహం తన భర్తదిగా గుర్తించింది. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కొడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.