చెరువులో పడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:20 AM
కంటకాపల్లి పంచాయతీ, కొత్త సుంకరపాలెం గ్రామ సమీపంలోని కొత్తవలస-విజయనగరం రోడ్డు పక్కనున్న చెరువులో మంగళవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం తేలియాడింది.
కొత్తవలస, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): కంటకాపల్లి పంచాయతీ, కొత్త సుంకరపాలెం గ్రామ సమీపంలోని కొత్తవలస-విజయనగరం రోడ్డు పక్కనున్న చెరువులో మంగళవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం తేలియాడింది. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు కొత్తవలస సీఐ షణ్ముఖరావు సిబ్బందితో వెళ్లి, పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయడానికి ఎవరూ సహసించ లేదు. చివరకు ఏఎస్‌ఐ జనార్దన్ సాహసించి చెరువులోకి దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని వయస్సు సుమారు 53ఏళ్లు ఉండవచ్చని భావిస్తు న్నారు. వీఆర్వో రామానుజం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి.. దర్యాప్తు నిమిత్తం ఎస్‌ఐ ప్రసాదరావుకు అప్పగించారు. మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట తరలించారు. అయితే ఆదివారం మధ్యా హ్నం ముగ్గురు వ్యక్తులు ఆటోలో ఇక్కడకు వచ్చారని, అందులో ఒక వ్యక్తి కలువ పూలు కోయడానికి చెరువులో దిగగా.. పూల తీగెలు చుట్టేయడంతో బయటకు రాలేక మునిగిపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. వీరు విశాఖపట్టణం నుంచి వచ్చినట్టు తెలుస్తోంది.