చెరువులో పడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:41 AM
పెదవేమలి గ్రామానికి చెందిన బోదంకి ఎర్నినాయుడు(50) అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం చెరువులో పడి మృతి చెందాడు.
గంట్యాడ, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): పెదవేమలి గ్రామానికి చెందిన బోదంకి ఎర్నినాయుడు(50) అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం చెరువులో పడి మృతి చెందాడు. ఎస్‌ఐ సాయికృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్నినాయు డు తన పశువులను వీరసాగరం చెరువు వైపు మేతకు తీసుకుని వెళ్లాడు. పశు వులు మేత మేస్తుండగా ఎర్నినాయుడు బహిర్భామికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.