చెరువులో పడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:08 AM
మండలంలోని నరవ గ్రామానికి చెందిన గేదెల అప్పలనాయుడు(45) ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందారు.
గంట్యాడ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి):మండలంలోని నరవ గ్రామానికి చెందిన గేదెల అప్పలనాయుడు(45) ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ సాయికృష్ణ అందించిన వివరాల మేరకు.. సోమవారం రాత్రి మృతుడు అప్పలనాయుడు ఎర్రచెరువులోకి స్నానం చేసేందుకు వెళ్లాడు. చెరువు లోతుగా ఉండటంతో కాలు జారి పడిపోయాడు. మంగళవారం ఉదయం చెరువులో మృతదేహం తేలియాడుతూ గ్రామస్థులకు కన్పించింది. ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.