Share News

వ్యాను పైనుంచి జారి వ్యక్తి మృతి

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:54 PM

వీరఘట్టంలో మంగళవారం వ్యాను పై నుంచి జారిపడి ఘటనలో పెనుమాక రాజు(36) మృతి చెందాడు.

వ్యాను పైనుంచి జారి వ్యక్తి మృతి

వీరఘట్టం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): వీరఘట్టంలో మంగళవారం వ్యాను పై నుంచి జారిపడి ఘటనలో పెనుమాక రాజు(36) మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం నుంచి గోనె సంచుల వ్యాన్‌ వీరఘట్టం వచ్చింది. ఆ వ్యాన్‌తో పాటు రాజు వచ్చాడు. ఇక్కడ గోనె సం చులు దించిన తర్వాత వ్యాన్‌పైన తాళ్లు సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తూ రాజు జారిపడ్డాడు. విషయం గమనించిన స్థానికులు అతడిని స్థానిక పీహెచ్‌సీ కి తరలించారు. అప్పటికే రాజు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రాజు మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కళాధర్‌ తెలిపారు.

Updated Date - Oct 14 , 2025 | 11:54 PM