Share News

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:11 AM

వేపాడకు చెందిన పూడి శంకర్‌(50) అనే వ్యక్తి అతిగా మద్యం తాగి శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందాడు.

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

వేపాడ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): వేపాడకు చెందిన పూడి శంకర్‌(50) అనే వ్యక్తి అతిగా మద్యం తాగి శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందాడు. వల్లంపూడి పోలీసులు, కుటుంబీకులు అందించిన వివరాల మేరకు.. శంకర్‌ మద్యానికి బానిసై తరచూ మద్యం తాగుతుండేవాడు. గత రెండు రోజులుగా అతిగా మద్యం తాగాడు. శుక్రవారం కూడా గ్రామ సమీపంలో ఉన్న ఓ మామిడితోటలో అతిగా మద్యం తాగి అక్కడే మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు పూడి సంతోష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుదర్శన్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌.కోట కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Sep 20 , 2025 | 12:11 AM