మద్యం మత్తులో టాయిలెట్ క్లీనర్ తాగి వ్యక్తి మృతి
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:12 AM
మద్యం మత్తులో ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న టాయిలెట్ క్లీనర్ తాగి మృతిచెందాడు.
ఎస్.కోట రూరల్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న టాయిలెట్ క్లీనర్ తాగి మృతిచెందాడు. శనివారం జరిగిన ఈ ఘటనపై సీఐ నారాయణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శ్రీనివాసకాలనీలో నివాసం ఉంటున్న ముమ్మన రమణ(50) శనివారం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అనంతరం ఇంట్లో ఉన్న టాయిలెట్ క్లీనర్ తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక్కడ వైద్యులు వెంటనే విజయనగరం మహారాజ ఆసుపత్రికి రిఫర్ చేశారు. రమణ అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.