పురుగు మందు తాగి వ్యక్తి మృతి
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:58 PM
మండలంలోని వంగర పంచాయ తీ ముద్దానపేట గ్రామంలో పురుగు మందు తాగి ఒకరు మృతిచెందారు.
దత్తిరాజేరు, జూలై 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని వంగర పంచాయ తీ ముద్దానపేట గ్రామంలో పురుగు మందు తాగి ఒకరు మృతిచెందారు. పెదమానాపురం ఎస్‌ఐ ఆర్.జయంతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దానపేట గ్రామానికి చెందిన ముద్దాన అప్పన్న(38) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయంలో ఆర్థికంగా నష్టపో యాడు. అప్పుల బాధ తాళలేక ఈనెల 14న ఇంటి ముందున్న పొలంలో పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న భార్య, పిల్లలు వెంటనే గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజ యనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖ కేజీహె చ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.