Share News

వ్యాను ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:01 AM

మండలంలోని పుర్రే యవలస జంక్షన్‌ సమీపంలో సోమవారం లగేజ్‌ వ్యాను ఢీకొని కుప్పిలి శ్రీనివాసరావు(37) అనే వ్యక్తి మృతిచెందాడు.

వ్యాను ఢీకొని వ్యక్తి మృతి
శ్రీనివాసరావు (ఫైల్‌)

చీపురుపల్లి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పుర్రే యవలస జంక్షన్‌ సమీపంలో సోమవారం లగేజ్‌ వ్యాను ఢీకొని కుప్పిలి శ్రీనివాసరావు(37) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పుర్రేయవలస గ్రామానికి చెందిన కుప్పిలి శ్రీనివాసరావు, కుప్పిలి నీలబాబులు బైకుపై చీపురుపల్లి నుంచి పుర్రేయవలస వెళ్తున్నారు. జంక్షన్‌ సమీపం లో ఎదురుగా వస్తున్న లగేజీ వ్యాను బలంగా ఢీకొట్టింది. బైక్‌పై వెనుకవైపున కూర్చున్న శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందా డు. వాహనం నడుపుతున్న నీలబాబుకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహా న్ని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 29 , 2025 | 12:01 AM