Share News

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:46 AM

మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య పాల్పడిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు.

 మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

భోగాపురం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య పాల్పడిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై భోగాపురం ఎస్‌ఐ పాపారావు మంగళవారం తెలిపి న వివరాలు ఇలా ఉన్నాయి. రావాడ గ్రామానికి చెందిన బుగత గోవిందమ్మ, ఈశ్వరరావు(47)లు భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు లావణ్య, అరుణకుమార్‌ ఉన్నారు. అయితే ఇటీవల తల్లికి వందనం పథకంలో భాగంగా గోవిందమ్మ బ్యాంకు ఖాతాలో నగదు జమ అయ్యింది. అలాగే అన్నదాత సుఖీభవ కింద ఈశ్వరరావుకు నగదు జమ అయ్యింది. ఈశ్వరరావు నిత్యం మద్యం తాగుతూ ఉంటాడు. అయితే పిల్లల స్కూల్‌ ఫీజు కట్టేందుకు డబ్బులు చాలవని గోవింద మ్మ.. తన భర్త ఈశ్వరరావును అన్నదాత సుఖీభవ డబ్బులు అడిగింది. దీనికి ఈశ్వరరావు ‘నా దగ్గర డబ్బులు లేవు.. నీదగ్గర ఉన్న డబ్బులు నాకు కావాలి’ అని భార్యని అడిగాడు. అలాగే ఇద్దరు పిల్లలు కూడా స్కూల్‌ ఫీజుకు డబ్బులు కావాలని ఈశ్వరరావును అడిగారు. దీంతో గట్టిగా కేకలు వేస్తూ ఈనెల 2వ తేదీ న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించడం ప్రారంభించారు. రావాడ సమీప లేఅవుట్‌లో వాంతులు చేసుకుంటూ ఉన్న ఈశ్వరరావు స్థానికులకు కనిపించాడు. పక్కనే గడ్డి మందు ఖాళీ డబ్బా ఉంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని హుటాహుటిన తగరపువలస ప్రైవేటు ఆసుపత్రికి తరలించా రు. అక్కడ చికిత్స పొందుతూ 3వ తేదీ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధించారు. గోవిందమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Aug 05 , 2025 | 12:46 AM